Toguta: ఎల్. బంజర్పల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Toguta: తొగుట మండలం ఎల్. బంజర్పల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి సోమవారం ప్రారంభించారు.
Toguta: ఎల్. బంజర్పల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!
సిద్దిపేట జిల్లా: తొగుట మండలం ఎల్. బంజర్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఎల్ బంజార్పల్లి గ్రామాన్ని గతంలో ముత్యం రెడ్డి హయంలోనే గ్రామ పంచాయతీని ప్రకటించారని అన్నారు.గ్రామానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.
అనంతరం గ్రామంలో మహిళా సంఘాల కోసం వీవో భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.




