Dubbak: కాళేశ్వరం విచారణపై హైకోర్టు తీర్పు.. రేవంత్ సర్కార్‌కు షాక్
Dubbak: కాళేశ్వరం విచారణలో కేసీఆర్, హరీష్ రావులకు దక్కిన ఊరటపై దుబ్బాక బీఆర్ఎస్ నేత ఇల్లందుల శ్రీనివాస్ హర్షం.
Dubbak: కాళేశ్వరం విచారణపై హైకోర్టు తీర్పు.. రేవంత్ సర్కార్‌కు షాక్
Dubbak: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మాజీ మంత్రి హరీష్ రావు గారికి హైకోర్టులో దక్కిన ఊరట రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపదెబ్బ అని దుబ్బాక మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ నేతలపై బురద చల్లాలని చూసిందని, కానీ న్యాయస్థానం ఆదేశాలతో నిజాయితీ గెలిచిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ విచారణలో సహజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కారని, చట్టబద్ధమైన నిబంధనలు పాటించలేదని హైకోర్టు పేర్కొనడం రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.




