Gajwel: గజ్వేల్ 14వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం!
Gajwel: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ నమోదును చైర్పర్సన్ చందన రవీందర్ బుధవారం ప్రారంభించారు.
Gajwel: గజ్వేల్ 14వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం!
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మి శ్రీనివాస్ హాజరై నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ చందన రవీందర్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు గల కుటుంబ పెద్దలు ఈ పథకానికి అర్హులని, వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారని వివరించారు.
అర్హులైన వారందరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రతులతో సమీపంలోని వార్డు నమోదు శిబిరాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.




