Gajwel: గజ్వేల్ 11వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!
Gajwel: సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదును కౌన్సిలర్ భవాని కర్ణాకర్ బుధవారం ప్రారంభించారు.
Gajwel: గజ్వేల్ 11వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!
సిద్దిపేట జిల్లా: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ కొలిచేలిమి భవాని కర్ణాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల కుటుంబ పెద్దలు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో నమోదు శిబిరానికి హాజరై పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచేలిమి స్వామి, చందన బోయిన కనకరాజు, భూములు పరశురాములు, జూకంటి ఆంజనేయులు, పిట్ల స్వామి, నారాయణ, శ్రీకాంత్, కనకయ్య, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, అంగన్‌వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.




