Siddipet: సొంతింటి సంతోషం.. ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

KARUNAKAR,	DUBBAK
Published on: 23 April 2026 2:34 PM IST
Siddipet
X

Siddipet: సొంతింటి సంతోషం.. ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

సిద్దిపేట జిల్లా: తొగుట మండలం కాన్గల్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొని లబ్ధిదారులు సోమగారి బుచ్చిరెడ్డి, కంచర్ల సంతోష్ గౌడ్,కూర్మ రాజు గార్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నాయని వారు పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమంలో తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), తొగుట మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేంద్ రెడ్డి, తొగుట సర్పంచ్ పాగల (శోభా )కొండల్ రెడ్డి, కాన్గల్ గ్రామ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బిక్షపతి, ఆత్మ కమిటీ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి, ఉపసర్పంచ్ ప్రశాంత్, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, సీనియర్ నాయకులు సిలివేరి రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story