Komuravelli: కొమురవెల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం!
Komuravelli: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు గురువారం ప్రారంభించారు.
Komuravelli: కొమురవెల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం!
సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి: కొమురవెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని, అర్హులైన వారందరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల తహసీల్దార్ దివ్య, మండల స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




