Bhoompalli: బీడీ కార్మికుల కోసం సంజీవని.. కత్తి కార్తిక గౌడ్ అద్భుతమైన చొరవ
Rameshampally: సిద్దిపేట జిల్లా రామేశంపల్లిలో బీడీ కార్మికులకు 'సంజీవని శక్తి' కిట్ల పంపిణీ. కత్తి కార్తిక గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు ఆరోగ్య అవగాహన.
Bhoompalli: బీడీ కార్మికుల కోసం సంజీవని.. కత్తి కార్తిక గౌడ్ అద్భుతమైన చొరవ
భూంపల్లి: ప్రతి బీడీ వెనుక ఒక తల్లి త్యాగం ఉంది, ఒక అక్క పోరాటం ఉంది, ఒక చెల్లెలి కలలు ఉన్నాయి. ఆకలిని గెలిచే ఈ పోరాటంలో,ఆరోగ్యం మాత్రం నెమ్మదిగా ఓడిపోతోంది.అందుకే వారి ఆరోగ్యం కోసంసంజీవని శక్తి కిట్లు టీమ్ కార్తీక పౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండలం రామేశంపల్లి గ్రామంలో బీడీ ఖర్కానా కి విచ్చేసి మహిళా బీడీ కార్మికులను కలిసి, వారి సమస్యలు తెలుసుకుని, వారి ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించి,వారికి సంజీవని శక్తి కిట్లు అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్.
అక్క ఈ కిట్ కోసం వివరిస్తూ ఈ సంజీవని కిట్, మీ ఊపిరిలో బలాన్ని, మీ గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది అని మీకు తోడుగా మీ బిడ్డగా నేను మీతో ఉన్నాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రవి, సర్పంచ్ తడకపల్లి రజిత కుమార్, వార్డ్ మెంబర్ పంచం లావణ్య రమేష్, కరుణాకర్, సతీష్ గౌడ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.




