Siddipet: పదవులు శాశ్వతం కావు.. పోరాటం ఆపను - ఎమ్మెల్సీ కోదండరాం

Siddipet: నూతన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాంను దుబ్బాక నియోజకవర్గ అభిమానులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Sai Potluri
Published on: 30 April 2026 1:25 PM IST
Siddipet
X

Siddipet: "పదవులు శాశ్వతం కావు.. పోరాటం ఆపను" ఎమ్మెల్సీ కోదండరాం.

Siddipet: నూతన శాసన మండలి సభ్యునిగా ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిశాలువాతోసన్మానించి,పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు దుబ్బాక నియోజకవర్గ ప్రోపేసర్ కోదండరామ్ అభిమానులు ప్రవీణ్,రాజిరెడ్డి, తదితరులు ఈ సందర్భంగా వివిధ ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పదవులు శాశ్వతం కావని అన్నారు. “ఒకాయన నేను పోరాడుతావా లేదా అని అన్నారు. నేను పోరాడి చూపిస్తా” అని స్పష్టం చేశారు.

అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన పని ఆగలేదని, ముందుకే సాగుతుందని తెలిపారు. వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తానని, లక్ష్యాలను స్పష్టంగా ఎంచుకుని పని చేస్తానని పేర్కొన్నారు.విద్య, వైద్య, వ్యవసాయ రంగ సమస్యలు, కవులు, రచయితలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల రీయింబర్స్‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు చేస్తున్న ప్రజా సేవను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎమ్మెల్సీ పదవి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.

Sai Potluri

Sai Potluri

Next Story