Koheda: గ్రామస్థాయి నుంచి సీపీఐని బలోపేతం చేయాలి

Koheda: కోహెడలో సీపీఐ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం. ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు చేసి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 31 Oct 2026 11:36 PM IST
Koheda
X

Koheda: గ్రామస్థాయి నుంచి సీపీఐని బలోపేతం చేయాలి

కోహెడ: సీపీఐ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి వెల్పుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కోహెడ మండల కేంద్రంలో శనివారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అన్యాయాలు, అక్రమాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను, ప్రజా పోరాటాల్లో పార్టీ పోషించిన పాత్రను, సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా కార్మికులు, కర్షకులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి బొనగిరి శంకర్, సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, తాళ్లపల్లి ఎల్లయ్య గౌడ్, చింతలపల్లి బాలరెడ్డి, జాగిరి బలయ్య, చిట్యాల శేఖర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కందుకూరి మహేష్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎర్ర శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD