Komuravelli: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో లిఫ్ట్‌కు తాళం.. భక్తుల అవస్థలు
Komuravelli: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌కు తాళం వేయడంతో వృద్ధులు, వికలాంగులు మెట్ల మార్గంలో నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Komuravelli: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో లిఫ్ట్‌కు తాళం.. భక్తుల అవస్థలు
కొమురవెల్లి: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సిబ్బంది తీరుతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌కు తాళం వేయడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాదు నుంచి వచ్చిన వృద్ధ దంపతులు మీడియా ముందు వారి గోడు వెళ్ళబోసుకున్నారు మెట్ల మార్గం నుండివెళ్లి దర్శనం చేసుకోవడం చాలా ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు, నడవలేని భక్తులు మెట్ల మార్గంలో వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను అందుబాటులో ఉంచాల్సిన సిబ్బంది తాళం వేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకించి వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు మండి పడుతున్నారు . ఆలయ అధికారులు పర్యవేక్షణ లేక పోవడం వల్ల అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి
ఇప్పటికైనా ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.




