Siddipet: కొమురవెల్లి బండ గుట్టపై ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా దేవస్థానం గదులు!

Siddipet: కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని బండ గుట్టపై ఎనిమిదేళ్లుగా దేవస్థానం గదుల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 15 Oct 2026 12:44 PM IST
Siddipet
X

Siddipet: కొమురవెల్లి బండ గుట్టపై ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా దేవస్థానం గదులు!

Siddipet: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం కనిపిస్తోందా? భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన దేవస్థాన గదుల నిర్మాణం ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదు కొమురవెల్లి బండ గుట్ట పై నిర్మాణం ప్రారంభమై ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తికాని గదులు అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పరిధిలో చేపట్టిన గదుల నిర్మాణం మాత్రం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఎనిమిదేళ్లు గడిచినా నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో.. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయి? భక్తులకు గదులు అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణ పనులు నిలిచిపోవడానికి గల కారణాలేంటి నిధుల కొరత ఉందా లేక అధికారుల పర్యవేక్షణ లోపించిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత దేవస్థాన అధికారులు స్పందించి, నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితిని వెల్లడించడంతో పాటు.. పనులు పూర్తి చేసే గడువును ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు. ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL