Siddipet: జాతీయ స్థాయి గట్కా పోటీలకు ఎంపికైన క్రాంతి పాఠశాల విద్యార్థి భరత్!
Siddipet: రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల్లో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి గట్కా పోటీలకు ఎంపికైన క్రాంతి పాఠశాల విద్యార్థి భరత్. చైర్మన్ అభినందనలు.
Siddipet: జాతీయ స్థాయి గట్కా పోటీలకు ఎంపికైన క్రాంతి పాఠశాల విద్యార్థి భరత్!
Siddipet: రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల్లో క్రాంతి పాఠశాల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక పోటీల్లో క్రాంతి పాఠశాలకు చెందిన ఎల్. భరత్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించడంతో పాటు, జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) గట్కా ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు.
టాప్-4లో భరత్ నిలకడ
ఉమ్మడి పది జిల్లాల పరిధి నుంచి అండర్-17 బాలుర విభాగంలో 35 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తీవ్ర పోటీ నడుమ భరత్ ప్రతిభ కనబరిచి టాప్-4లో నిలిచాడు. జాతీయస్థాయికి ఎంపికైన ఎనిమిది మందిలో చోటు సంపాదించడం విశేషం.
చైర్మన్ అభినందనలు
జాతీయస్థాయికి ఎంపికైన భరత్‌ను క్రాంతి పాఠశాల చైర్మన్ భగవాన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కఠినమైన పోటీలను ఎదుర్కొని రాష్ట్రస్థాయిలో పతకం సాధించడం పాఠశాలకు గర్వకారణమని ఆయన అన్నారు. జాతీయస్థాయిలోనూ రాణించి పాఠశాలకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భరత్‌కు శిక్షణ అందించిన పీఈటీ ఉపాధ్యాయులను, అతని తల్లిదండ్రులను కూడా చైర్మన్ అభినందించారు.




