Siddipet: వెంకట్రావుపేటలో అమ్మవారి పూజలు.. వార్షికోత్సవంలో పాల్గొన్న నేతలు!
Siddipet: సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో ఘనంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి.
Siddipet: వెంకట్రావుపేటలో అమ్మవారి పూజలు.. వార్షికోత్సవంలో పాల్గొన్న నేతలు!
సిద్దిపేట జిల్లా: తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీ ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ మహోత్సవంలో దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి,AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) గార్లు పాల్గొని ఎల్లమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం వారు మాట్లాడుతూ ఎల్లమ్మ దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సంతోషాలతో, పాడిపంటలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నారు. వారిని గౌడ్ సంఘం పెద్దలు సన్మానం చేశారు.కార్యక్రమంలో గౌడ్ సంఘం పెద్దలు,నాయకులు పాగాల కొండల్ రెడ్డి, పంది రాజు, బెజ్జనబోయిన అనిల్,బండారు రమేష్ గౌడ్,సంతోష్,ప్రవీణ్,స్వామి, భారత్ తేజ,భాను చందర్, తదితరులు పాల్గొన్నారు.
Next Story




