Husnabad: సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కొట్టుకుపోయిన తోటపల్లి–జనగామ లింక్ రోడ్డు!

Husnabad: హుస్నాబాద్ మండలంలో భారీ వర్షానికి దెబ్బతిన్న తోటపల్లి-జనగామ లింక్ రోడ్డు. రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 14 Sept 2026 3:16 PM IST
Husnabad
X

Husnabad: సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కొట్టుకుపోయిన తోటపల్లి–జనగామ లింక్ రోడ్డు!

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో కురిసిన భారీ వర్షానికి లింక్ రోడ్డు కొట్టుకుపోయింది.

ఈరోజు ఉదయం కురిసిన వర్షానికి తోటపల్లి నుంచి జనగామకు వెళ్లే లింక్ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గ్రామాల మధ్య ఉన్న రహదారి కొట్టుకుపోవడంతో అటువైపు రాకపోకలు సాగించే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులకు ఈ రహదారి ఎంతో కీలకమని తోటపల్లి, జనగామ గ్రామస్తులు తెలిపారు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రిగారు చొరవ తీసుకుని అవసరమైన నిధులు కేటాయించి, తోటపల్లి–జనగామ లింక్ రహదారిని వెంటనే పునర్నిర్మించాలని ఇరు గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD