Cherial: వాగును డంపింగ్ యార్డ్‌గా మార్చిన వేచరేణి పంచాయతీ

Cherial: చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో సహజసిద్ధ వాగును పంచాయతీ డంపింగ్ యార్డ్‌గా మార్చడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 8 Nov 2026 3:07 PM IST
Cherial
X

Cherial: వాగును డంపింగ్ యార్డ్‌గా మార్చిన వేచరేణి పంచాయతీ

చేర్యాల: చేర్యాల మండల పరిధిలోని వేచరేణి గ్రామంలో వాగు డంపింగ్ యార్డ్‌గా మారుతోంది. గ్రామ పంచాయతీ నిర్వాకంతో వాగులో చెత్తాచెదారం పేరుకుపోతుండటంపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాగులో చెత్తను పారవేయడంతో పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, దుర్వాసనతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులో చెత్త పేరుకుపోవడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

గ్రామంలో పారిశుధ్యాన్ని కాపాడాల్సిన గ్రామ పంచాయతీనే వాగును డంపింగ్ యార్డ్‌గా మార్చడంపై ప్రజలు మండిపడుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, భవిష్యత్తులో చెత్తను వాగులో వేయకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL