Daulatabad: ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన లోక్ సహాయ వాణి ట్రస్ట్!
Daulatabad: శేరిపల్లి బందారం గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దివంగత నారాయణ కుటుంబానికి 'లోక్ సహాయ వాణి ట్రస్ట్' రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందించింది.
Daulatabad: ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన లోక్ సహాయ వాణి ట్రస్ట్!
సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండల పరిధిలోని శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లోక్ సహాయ వాణి ట్రస్ట్ మరోసారి తన ఉదారతను చాటుకుంది.
మండల పరిధిలోని షేర్ పల్లి బందారం గ్రామానికి చెందిన దివంగత శ్రీ తిప్పనమైన నారాయణ ఇటీవల మరణించడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సంపాదించే వ్యక్తిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న లోక్ సహాయ వాణి ట్రస్ట్ సభ్యులు తక్షణమే స్పందించారు.
ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇస్తూ.. వారి తక్షణ అవసరాల నిమిత్తం పదివేల రూపాయల 10,000. నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. గ్రామంలోని వారి నివాసానికి వెళ్లిన ట్రస్ట్ ప్రతినిధులు నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.




