Siddipet: బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా మాదాసు వెంకట్ గౌడ్

Siddipet: భారతీయ జనతా పార్టీ సిద్ధిపేట జిల్లా నూతన కార్యదర్శిగా మాదాసు వెంకట్ గౌడ్ నియమితులయ్యారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 12 July 2026 7:46 AM IST
Siddipet
X

Siddipet: బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా మాదాసు వెంకట్ గౌడ్

Siddipet: భారతీయ జనతా పార్టీ సిద్ధిపేట జిల్లా కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆదేశాల ఎమేరకు జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ ప్రకటించారు. దానిలో భాగంగానే మాదాసు వెంకట్ గౌడ్ను సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి మాదాసు వెంకట్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాదాసు వెంకట్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story