Siddipet: అశాస్త్రీయ వర్గీకరణ, రోస్టర్ సవరించే వరకు పోరాటం: మాల జేఏసీ
Siddipet: ఎస్సీ వర్గీకరణ నూతన రోస్టర్ పాయింట్లను సవరించే వరకు ఉద్యమిస్తామని, 'నో రోస్టర్ - నో ఓట్' విధానాన్ని అమలు చేస్తామని సిద్దిపేటలో మాల జేఏసీ తీర్మానించింది.
Siddipet: అశాస్త్రీయ వర్గీకరణ, రోస్టర్ సవరించే వరకు పోరాటం: మాల జేఏసీ
Siddipet: విద్యా ఉద్యోగాలలో మాలలకు అన్యాయం చేస్తున్న రోస్టర్ సవరించే వరకు సంఘటితంగా ఉద్యమించాలని రిటైర్డ్ కెనరా బ్యాంక్ ఏజీఎం, మాల కోఆర్డినేషన్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు సిహెచ్. తిరుపతయ్య అన్నారు.
ఆదివారం నాడు సిద్దిపేట మున్సిపాలిటీ ఒకటో వార్డు లింగారెడ్డి పల్లి గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రోస్టర్ పాయింట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన తిరుపతయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు లో భాగంగా నూతనంగా అమల్లోకి తెచ్చిన రోస్టర్ పాయింట్లు కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
అదేవిధంగా మల్టీజోన్ ల వల్ల సైతం మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాలలకు నూతన రోస్టర్ వల్ల భారత రాజ్యాంగం ద్వారా అమలవుతున్న రిజర్వేషన్లే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా లల రో స్టర్ పాయింట్ 22 నుండి 10 లో పు తగ్గించే వరకు ఐక్య ఉద్యమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.
మాలలకు జరుగుతున్న అ న్యాయంపై గ్రామ గ్రామాన గడపగడపన ప్రచారం చేసి మాలలను చైతన్యం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట మాలల జేఏసీ చైర్మన్ ఆస లక్ష్మణ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాలల జనాభాను తక్కువగా చూపించి వర్గీకరణ చేయడం వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఈ అన్యాయంపై జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలను చేపడుతున్నట్లు జిల్లా మాలల జేఏసీ గౌరవాధ్యక్షులు గ్యాదరి రామస్వామి అన్నారు. ఈ సదస్సులో సిద్దిపేట జిల్లా మాల జేఏసీ కోర్ కమిటీ సభ్యులు మెరుగు మహేష్ అధ్యక్షత వహిస్తూ 1) మాలల రోస్టర్ పాయింట్ల సవరించేంతవరకు ప్రభుత్వ నోటిఫికేషన్లు వేయొద్దని ఒకవేళ వేస్తే అడ్డుకుంటామని & 2) అశాస్త్రియమైన వర్గీకరణను మరియు ఎస్సీ గ్రూప్ త్రీ రోస్టర్ పాయింట్లను సవరించేంతవరకు మాలలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వద్దని,,,, అది మున్సిపల్ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, మాలలకు NO ROSTER, కాంగ్రెస్ కు - NO VOTE అనే తీర్మానాలు ప్రవేశపెట్టగా మాలలు చప్పట్లతో ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో మాల జేఏసీ జిల్లా ప్రతినిధులు మాజీ ఎంపిటిసి బండి రంగయ్య, అల్లిబిల్లి నరసింగరావు, దేవరాజు, సత్య కృష్ణ, పార్థసారథి, పి.శంకర్, ఎల్లేష్,పత్రి యాదగిరి, పల్లెటూరి ప్రసాద్, అందే ప్రవీణ్, న్యాయవాది బిక్షపతి, కొడకండ్ల కృష్ణ, రాజేందర్, గ్రామానికి చెందిన ఉద్యోగస్తులు & నాయకులు డిప్యూటీ తాసిల్దార్ పోతుల రాజేశం, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోతుల కృష్ణ, టీఎన్జీవో సంఘం తాలూకా అధ్యక్షులు పోతుల సత్యనారాయణ, పోతుల రమేష్, గ్రామపంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధి మధ్యలో నరసింగరావు, గ్రామ అభివృద్ధి అధికారుల సంఘం ప్రతినిధులు మద్దెల రవి, మద్దెల కమలాకర్, కుల పెద్దలు పోతుల మోహన్, పోతుల మహేష్, పోతుల సురేష్, మద్దెల ఉషయ్య, మేరుగు బద్దిరాజు,మేరుగు శేఖర్, మేరుగు రాజు, డాక్టర్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం అధ్యక్షులు తప్పెట రమేష్, కార్యదర్శి మెరుగు మాధవ్, పోతుల లక్ష్మీనారాయణ, మద్దెల రాజు, మెరుగు కృష్ణవేణి, మధ్యల లక్ష్మి, పోతుల లావణ్య, బండి సుశీల తదితర 200 మంది మాల కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




