Dubbak: కుంభాల రవి కుటుంబాన్ని పరామర్శించిన మాల మహానాడు నేతలు!
Dubbak: మండలం పెద్దచీకోడులో జర్నలిస్టు కుంభాల రవి తల్లి రాజవ్వ మృతి చెందడంతో, మాల మహానాడు నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Dubbak: కుంభాల రవి కుటుంబాన్ని పరామర్శించిన మాల మహానాడు నేతలు!
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామానికి చెందిన జర్నలిస్టు కుంభాల రవి తల్లి స్వర్గీయ కుంభాల రాజవ్వ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న జాతీయ మాల మహానాడు రాష్ట్ర పొలిట్ చైర్మన్ ర్యాకం శ్రీరాములు, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి కాల్వ నరేష్, అక్బర్‌పేట-భూంపల్లి మాల మహానాడు మండల అధ్యక్షులు మండల యాదగిరి, మిడిదొడ్డి మాల మహానాడు మండల అధ్యక్షుడు దారస్వామి, దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వ లింగయ్య, బక్కులు బావాజీ, రమేష్ తదితరులు మంగళవారం కుంభాల రవి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుంభాల రాజవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజవ్వ మృతి పట్ల వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజవ్వ మృతి కుంభాల రవి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.




