Dubbak: తొగుటలో మల్లన్నసాగర్ నిర్వాసితుల పాలాభిషేకం!

Dubbak: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు R&R ప్యాకేజీ అమలు చేయాలన్న కోర్టు తీర్పుతో తొగుటలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ చిత్రపటాలకు పాలాభిషేకం.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 Sept 2026 9:00 AM IST
Dubbak
X

Dubbak: తొగుటలో మల్లన్నసాగర్ నిర్వాసితుల పాలాభిషేకం!

Dubbak: సిద్దిపేట జిల్లా తొగుటలో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించే R&R ప్యాకేజీ అమలు చేయాలని కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ విషయం గురించి అహర్నిశలు కృషి చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

తొగుట,తుక్కాపూర్ గ్రామ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడటం హర్షణీయమని ఈ సందర్భంగా భూ నిర్వాసితులు తెలిపారు. తుక్కాపూర్, తొగుట గ్రామ భూ నిర్వాసితులకు 123 జీవోతో పాటు R&R (పునరావాసం–పునరావాస పునరుద్ధరణ) ప్యాకేజీ అందించాలని కోర్టు ఆదేశించడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు.

ఎన్నో ఏళ్లుగా భూములు కోల్పోయి న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితుల పోరాటానికి ఈ తీర్పు ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి న్యాయమైన పరిహారం, పునరావాసం అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story