Daulatabad: మహిళను దోచుకున్న మాయగాడు.. నగలు రికవరీ చేసిన పోలీసులు

Daulatabad: దౌల్తాబాద్ మండలంలో లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఒక మహిళ మెడలోని బంగారు ఆభరణాలు వెండి పట్టీలు దోచుకున్న ఎరుకలి శ్రీను అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 6 May 2026 9:20 AM IST
Daulatabad
X

Daulatabad: మహిళను దోచుకున్న మాయగాడు.. నగలు రికవరీ చేసిన పోలీసులు

దౌలతాబాద్: గంటల సమయంలో ఒక మహిళ ఆటో కోసం వేసి చూడగాఒక గుర్తు తెలియని వ్యక్తి తాను సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి వెళ్తున్నాను అని మాటలు చెప్పి ఒక మహిళను తన మోటార్ సైకిల్ పైన దౌల్తాబాద్ లో ఎక్కించుకొని దీపం పల్లె గ్రామ శివారులోని వద్ద వెళ్లగానే బండిలో పెట్రోల్ అయిపోయింది అని చెప్పి బండి ఆపేసి ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు తాడు, 2 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి కాళ్ల పట్టీలు లాక్కొని పారిపోవడం జరిగింది.

పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా వ్యక్తులు బండి మీద లిప్ట్ ఇస్తామని మాయ మాటలు చెప్తే వారి మాటలు నమ్మకుండా ఇలాంటి వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించనైనది. ఇట్టి నేరానికి పాల్పడిన వ్యక్తి సిద్దిపేట జిల్లా రామరం గ్రామం రాయ పోల్ మండలం కు చెందిన ఎరుకలి శ్రీనును పట్టుకొని రిమాండ్ కు తరలించనైనది.నిందితుని వద్దనుండి 3 తులాల బంగారు తాడు, 2 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 వెండి కాళ్ల పట్టీలు రికవరీ చేయనైనది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story