Thoguta: తొగుట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంది రాజు నియామకం!
Thoguta:మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పంది రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
Thoguta: తొగుట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంది రాజు నియామకం!
తొగుట: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే నా నియామకానికి సహకరించి, నన్ను ప్రోత్సహించిన ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ గాంధారి నరేందర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చెరుకు విజయ్ అమర్ రెడ్డికి,తాజా మాజీ అధ్యక్షులు శ్రీ అక్కం స్వామి గారికిప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నాపై పార్టీ నాయకత్వం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నిబద్ధతతో పని చేస్తానని, మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఈ సందర్భంగా పంది రాజు తెలిపారు.
రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్తను కలుపుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.




