Siddipet: తాటిముంజలు తింటూ రఘునందన్ రావు ఎంజాయ్!

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సామాన్యుడిలా సందడి చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 24 April 2026 8:31 AM IST
Siddipet
X

Siddipet: తాటిముంజలు తింటూ రఘునందన్ రావు ఎంజాయ్!

సిద్దిపేట: మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్రావు సామాన్యుడిలా మారిపోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముకుంటున్న ఓ చిరువ్యాపారిని చూసి ఆయన తన వాహ నాన్ని ఆపారు. నేరుగా వ్యాపారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాటిముంజలను కొనుగోలు చేసి అక్కడే తింటూ ఆస్వాదించారు. ఎంపీ స్వయంగా వచ్చి పలకరించడంతో సదరు వ్యాపారి ఆనందం వ్యక్తం చేశారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story