Raghunandan Rao: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు.. పొద్దుతిరుగుడు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి!
Raghunandan Rao: భాగ్యనగరం (హైదరాబాద్) పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిశారు.
Raghunandan Rao: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు.. పొద్దుతిరుగుడు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని విజ్ఞప్తి!
భాగ్యనగరం (హైదరాబాద్): భాగ్యనగరం పర్యటనకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి స్వాగతం పలికి, ఈ యాసంగిలో పండిన పొద్దుతిరుగుడు పంటను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని వినతిపత్రం ఇచ్చిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.
తెలంగాణలో పొద్దుతిరుగుడు పంట 21091 ఎకరాల నుంచి 27,675 ఎకరాలకు పెరిగింది పంట ఉత్పతి కూడా 13935 మెట్రిక్ టన్నుల నుంచి 19373 మెట్రిక్ టన్నులకు పెరిగింది.
కేవలం 5376 రూపాయల ధర మాత్రమే పలుకుంది... కనీస మద్దతు ధర 7721 రూపాయల కనీస మద్దతు ధర వచ్చే విధంగా చూడలాని విజ్ఞప్తి.
మెదక్ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలలో పంట మార్పిడి లో భాగంగా యాసంగి లో పొద్దు తిరుగుడు పంట ఎక్కువగా పండిస్తున్నారు. దయచేసి వెంటనే పంట పూర్తిగా మద్దతు ధర తో వెంటనే కొనుగోలు చేసేవిదంగా సంబంధిత శాఖలకు సూచించాలంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది, అనంతరం మంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.




