Dubbaka: దుబ్బాకలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం..
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు.
Dubbaka: దుబ్బాకలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం..
దుబ్బాక: క్యాన్సర్ పై పోరాటానికి సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు సహకారంతో, ఓ ఆస్పత్రి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించను న్నారు.
ఈ మేరకు ఆదివారం దుబ్బాకలో నిర్వహించే శిబిరంతో ఈ కార్యక్రమాన్నిషురూ చేయనున్నారు. అందుకోసం ప్రత్యేక బస్సును రూపొందించారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రారంభదశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ శిబిరంలో ప్రముఖ క్యాన్సర్ నిపుణుల బృందం పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. బ్రెస్ట్, సర్వైకల్, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనుమానా స్పద లక్షణాలు ఉన్నవారికి తదుపరి చికిత్స, వైద్య సలహాలపై మార్గ నిర్దేశం చేయనున్నారు.




