Siddipet: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై మీసేవలోనే యూరియా బుకింగ్!

Siddipet: రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీ సులభతరం చేసేందుకు మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 July 2026 10:08 AM IST
Siddipet
X

Siddipet: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై మీసేవలోనే యూరియా బుకింగ్!

రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభత రం చేయటం కోసం ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసంవ్యవసాయశాఖ యూరియా బుకింగ్ సేవను రాష్ట్రవ్యాప్తం గా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫర్టిలై జర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులు తమ సమీపం లోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి, ఆప రేటర్ సహాయంతో యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో పనిచేస్తున్న మీసేవ. వ్యవసాయశాఖతో కలిసి ఈ సరికొత్త సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా రైతు తన పట్టాదారు పాస్బుక్ నంబర్ సమీ పంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించా ల్సి ఉంటుంది. అక్కడ మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీ ర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story