Husnabad: హుస్నాబాద్‌లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 2 May 2026 2:35 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీగార్డెన్స్ లో ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ఆర్డీఓ చదివి వినిపించారు. నియోజకవర్గ స్థాయి చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వినిపించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలనుద్దేశించి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల ఐదు నెలల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరియు రాష్ట్ర మంత్రుల సహకారంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. 250 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతులకు అందించామని,

మరణించిన 679 మంది రైతు కుటుంబాలకు 49 కోట్ల 96 లక్షల రూపాయల రైతు బీమా అందించామని, 150 కోట్ల రూపాయలతో 3,515 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా కొన్ని ఇలా నిర్మాణాలు పూర్తిగా మరికొన్ని వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని ఇప్పటివరకు 74 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు వివిధ దశలలో చెల్లించడం జరిగిందని తెలిపారు. 57,963 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 45 వేల మందికి పింఛను అందిస్తున్నామని పది సంవత్సరాలు కొత్త పింఛన్లను మంజూరు చేయలేదని త్వరలోనే కొత్తగా మరింత మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story