Husnabad: హుస్నాబాద్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశం.
Husnabad: హుస్నాబాద్‌లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం
హుస్నాబాద్: హుస్నాబాద్ టౌన్‌లో 18వ వార్డ్ లో కొనసాగుతున్న SIR ప్రక్రియను రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు .
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన మంత్రి, బీఎల్ఓలు, బీఎల్ఏలతో మాట్లాడి ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ఎలాంటి అర్హుల పేరు కూడా జాబితాలో నుంచి మిస్ కాకుండా, తప్పులు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్న మంత్రి, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమం లో మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు




