Husnabad: అక్కన్నపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తల సమావేశం

Husnabad: హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేటలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

SRINIVAS, HUSNABAD
Published on: 29 April 2026 7:57 PM IST
Husnabad
X

Husnabad: అక్కన్నపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తల సమావేశం

Husnabad: హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. సమావేశంలో పాల్గొన్న పీసీసీ జనరల్ సెక్రటరీ సౌజన్య,ఆత్మా కమిటీ చైర్మన్ ఐలయ్య,వివిధ గ్రామాల సర్పంచ్ లు ,పార్టీ ముఖ్య నేతలు.

మంత్రి పొన్నం ప్రభాకర్.. ధాన్యం కొనుగోలు గతంలో ఆఫ్ లైన్ లో ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగింది వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఉంటే అధికారులు పరిష్కారం చేస్తారు. తేమ శాతం సరైన విధంగా ఉండి కూడా కొనుగోలు చేయలేకపోతే సమస్యలు వస్తాయి. ధాన్యం కొనుగోలు పై ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలి.

గ్రామాల్లో తాగునీటి సరఫరా లో సమస్యలు రావద్దు. ఆయా గ్రామాల్లో శాశ్వత పరిష్కారం చూపాలి..బావులు పుడుకతీత , పైప్ లైన్ వేయడం , తదితర అంశాలపై పరిష్కారం చూడపడానికి ఐదుగురు తో కమిటీ వేయాలి. జూన్ లో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అందరు ఇన్వాల్వ్ కావాలి. ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలి.

పాఠశాలల ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పెయింట్స్ వేయడం ,మౌలిక సదుపాయాలు కల్పించడం,టీచర్లు ఏర్పాటు చేయడం బాధ్యత ప్రభుత్వం ది. వర్ష కాలంలో వన మహోత్సవం కార్యక్రమంలో బాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి.. అందుకు ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలి.

అక్కన్నపేట మండలానికి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలి.. అందరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి. ఈ కమిటీ లు బాధ్యత గా వ్యవహరించినప్పుడే గ్రామాల్లో సమస్యలు తొలుగుతాయి. గ్రామాల వారిగా వేరు వేరుగా కూర్చొని కమిటీల సబ్యుల పేర్లు ఇవ్వాలి.

విద్య,వైద్యం,తాగు నీరు, సాగు నీరు తదితర అంశాల సమస్యల పై చెప్పండి. పార్టీ బలంగా ఉండాలి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD

Next Story