Husnabad: హుస్నాబాద్ మరకత శివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు!

Husnabad: హుస్నాబాద్‌లోని మరకత శివాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు, లింగాభిషేకం. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలకై ప్రార్థనలు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 7 Nov 2026 11:41 AM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్ మరకత శివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు!

Husnabad: హుస్నాబాద్‌లోని మరకత శివాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి లింగాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి స్వామివారిని ప్రార్థించారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని స్వామివారిని వేడుకున్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD