Husnabad: గౌరవెల్లి కాలువల భూసేకరణకు రూ. 250 కోట్లు విడుదల: మంత్రి!

Husnabad: గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 6 Aug 2026 11:31 PM IST
Husnabad
X

Husnabad: గౌరవెల్లి కాలువల భూసేకరణకు రూ. 250 కోట్లు విడుదల: మంత్రి!

హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, కాలువల భూసేకరణ వేగవంతంగా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా పాఠశాల పరిసరాల్లో మొక్కలు నాటారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు తంగళ్ళపల్లిలో పాఠశాల భవనాలు పూర్తిచేసి హాస్టల్ వసతులతో సహా తరగతులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

అన్ని క్రీడా పరమైన ఇతర సౌకర్యాలకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ స్కూల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నమని తెలియజేశారు. ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీపడే విధంగా దేశానికి ఆదర్శంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండనున్నయన్నారు. రాష్ట్రంలో వేగంగా నిర్మాణం జరుగుతున్న రెండు, మూడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈ పాఠశాల ఒకటనీ, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంకొక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని సీఎం ను కోరుతామన్నారు.

2007లో ఫౌండేషన్ పడిన గౌరవెల్లి ప్రాజెక్టు, 2027 లో 20 సంవత్సరాల తర్వాత పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చే బాధ్యత తనదని, ఇవ్వకున్న బాధ్యత తనదేనన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కల అని, చిన్న చిన్న కాలువల భూసేకరణలో భూమి పోతున్న రైతులు సహకరించాలన్నారు. త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమం తీసుకున్నామని పేర్కొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story