Akkanapet: సిఎం విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు అవమానకరం మంత్రి పొన్నం!

Akkanapet: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలు అడ్డుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు.

SRINIVAS, HUSNABAD
Published on: 22 Aug 2026 1:31 PM IST
Akkanapet
X

Akkanapet: సిఎం విదేశీ పర్యటనపై కేంద్రం ఆంక్షలు అవమానకరం మంత్రి పొన్నం!

Akkanapet: రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి కి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అవమానకరమైన విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రికి విదేశాలకు వెళ్లే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి పర్యటించారు. గ్రామాలలో ప్రభుత్వ పథకాల అమలు, సమస్యలపై ప్రజలు, రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల సమగ్ర అభివృద్దె లక్ష్యంగా పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు.

కానీ తెలంగాణ బిజెపి నాయకులు తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడగడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం నుండి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కోసం ఎందుకు గళ మెత్తడం లేదని ప్రశ్నించారు.bబిజెపి రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత కోసం కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది కానీ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిలదీయడంలో రాష్ట్ర ఇటు బిజెపి నాయకత్వంలో, రాష్ట్ర అభివృద్ధికి సహకరించడంలో అటు కేంద్ర బిజెపి నాయకత్వంలో ఐక్యత కనిపించడం లేదన్నారు.

రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ తెలంగాణకు రావలసిన మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్లు వంటి కీలక ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ఇతర ప్రాజెక్టులకు కేంద్రం మోకాలు అడ్డుతోందన్నారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ అగ్రభాగంలో ఉండే విధంగా అభివృద్ధి దిశలో తీసుకపోవాలనే తమ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టం లో చాలా పొరపాటు అని విమర్శించారు.

ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ జీవసత్వాలు లేక, తెలంగాణ అభివృద్ధి పట్ల అడగలేక, తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కొట్లాడి నిధులు తేలేక పూర్తిగా కనుమరుగై, బిజెపి కార్యాలయానికి తాళాలు వేసుకునే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు మార్పు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తెచ్చే ప్రయత్నంలో ముందు ఉండాలని కోరారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD