Husnabad: వర్షాల కోసం 108 కలశాలతో వరుణ యాగం!
Husnabad: హుస్నాబాద్‌లో ఓటర్ సవరణపై బిఎల్ఏలు, నేతలతో మంత్రి పొన్నం సమీక్ష. శ్రీ రేణుక ఎల్లమ్మ దర్శనం, సమృద్ధిగా వర్షాలు కురవాలని మరకత లింగేశ్వరాలయంలో వరుణ యాగం.
Husnabad: వర్షాల కోసం 108 కలశాలతో వరుణ యాగం!
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్ సవరణ ప్రక్రియపై బిఎల్ఏ లు, సూపర్వైజర్లు, పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు సవరణ ప్రక్రియలో తన ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బిఎల్ఓ కు అందించారు.
అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అత్యంత బాధ్యతతో పనిచేయాలని వారికి సూచించారు. అనంతరం స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మరకత లింగేశ్వర ఆలయంలో వర్షాల కోసం వరుణ యాగం పూజలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని 108 కలుశాలతో వరుణ యాగం నిర్వహించారు.




