Husnabad: రామగుండం ఎరువులు తెలంగాణ రైతులకే ఇవ్వాలి పొన్నం!

Husnabad: రువుల కొరత ఏర్పడితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ నేతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు

SRINIVAS, HUSNABAD
Updated on: 30 Jun 2026 12:53 PM IST
Husnabad
X

Husnabad: రామగుండం ఎరువులు తెలంగాణ రైతులకే ఇవ్వాలి: పొన్నం!

హుస్నాబాద్: రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఇండ్ల ముందు ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17, 18 వార్డుల్లో కొనసాగుతున్న సర్ (SIR) ఓటర్ సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు నుండి రైతు భరోసా కార్యక్రమంను ప్రారంభం చేస్తోందని, ప్రతిపక్షాలు మేమేదో జాప్యం చేస్తున్నామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు.

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు మొత్తం జమ చేయడానికి నాలుగు, ఐదు నెలల కాలం పట్టిందని, వారు పదేళ్ల కాలంలో రైతులకు మొత్తం 72,000 కోట్లు ఇస్తే, మేము 30 నెలల్లో 28 వేల కోట్లు రైతాంగానికి ఇచ్చామని, బోనస్, సబ్సిడీపై యంత్ర పరికరాలను కూడా ఇస్తున్నమన్నారు.

ఎరువుల తయారీ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని, ఎరువులు తయారు చేసేది, సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరా తగ్గిస్తోందని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదని సతాయించాలనే ఉద్దేశంతో పాటు, ఎరువుల శాతం తక్కువ వాడి మందుల ప్రభావితం కావద్దనే ఉద్దేశంతో చేస్తోందన్నారు.

రాష్ట్రానికి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి, మంత్రులం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని, రాష్ట్రానికి సంబంధించిన ఎరువుల సరఫరా భారతీయ జనతా పార్టీ బాధ్యత అన్నారు. కేంద్రం తయారు చేస్తున్న ఎరువులతో పాటుగా రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులు మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎరువులకు సంబంధించి తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని, రాష్ట్రంలో 8 మంది బిజెపి ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న పట్టించుకోవడం లేదన్నారు.

వచ్చేసరికి అధికారం మాదే అని చెప్పుకుంటున్న రాష్ట్ర బిజెపి నాయకులకు రైతులకు సంబంధించి ఎరువుల కొరత విషయంలో మాట్లాడే బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

ఎరువుల కొరత విషయంలో రాష్ట్ర బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూరియా యాప్ కు సంబంధించి ఎవరైనా రైతులకు ఆపరేటింగ్ చేయరాకపోతే రైతు వేదికలలో సంబంధిత ఏఈఓ లను సంప్రదించాలన్నారు. వచ్చిన ఎరువులను రైతులందరికీ ఇబ్బందులు లేకుండా సరఫరా చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు.

SRINIVAS, HUSNABAD

SRINIVAS, HUSNABAD

Next Story