Husnabad: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి!
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వన మహోత్సవంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు.
Husnabad: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి!
Husnabad: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జాతీయ చేనేత దినోత్సవం లో పాల్గొన్న మంత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
రాబోయే సమాజం మన అందరినీ హర్షించాలన్న , జ్ఞాపకం ఉంచుకోవాలన్న ప్రకృతిని సమతుల్యం చేయాల్సిన బాధ్యత మన అందరిది పై ఉందని మంత్రి తెలిపారు. వర్షాలు అధికంగా పడడం, కరువులు రావడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కోట్లాది మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇది ఒక రోజు కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకొని వాటిని పెంచి సంరక్షించాలన్నారు.
మొక్కలు నాటడంలో హుస్నాబాద్ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు మాత్రమే వాడాలన్నారు. అధికారిక కార్యక్రమాల్లో సింథటిక్ శాలువాలు కాకుండా నేతన్నలు తయారుచేసిన వస్త్రాలు వాడాలని సూచించారు.
చేనేత వస్త్రాలు వాడడం వల్ల వృత్తిని ప్రోత్సహించి, నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లు ఉంటుందన్నారు. అందరం చేనేత వస్త్రాలు వాడాలని ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. డిగ్రీ కళాశాలకు కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తామని, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని అధ్యాపకులను కోరారు.




