Husnabad: గిరిజన ఫుట్‌బాల్ క్రీడాకారిణికి మంత్రి వాకిటి శ్రీహరి రూ.లక్ష సాయం!

Husnabad: వచ్చే ఏడాది జనవరిలో మెక్సికోలో జరిగే అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైన అక్కన్నపేట క్రీడాకారిణి బానోతు శైలజకు క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి రూ.లక్ష సాయం అందించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 13 Nov 2026 10:12 PM IST
Husnabad
X

Husnabad: గిరిజన ఫుట్‌బాల్ క్రీడాకారిణికి మంత్రి వాకిటి శ్రీహరి రూ.లక్ష సాయం!

Husnabad: ఈరోజు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర పశుసంవర్ధక చేపలు స్పోర్ట్స్ మరియు యూత్ సంక్షేమ శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరిని కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం అంబానాయక్ తండ గ్రామానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారిణి బానోతు శైలజ స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం తరఫున దేశం తరఫున వచ్చే సంవత్సరం జనవరిలో మెక్సికో సిటీలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికైన శైలజని అభినందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా ఖర్చులు వీసా టికెట్ల నిమిత్తం లక్ష రూపాయల 100000/ నిధులు మంజూరు చేయడం జరిగింది.

అలాగే దేశానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడల్లో రాణించాలని కోరారు ఇందుకోసం సహకరించిన హుస్నాబాద్ నియోజకవర్గ బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మున్నూరు కాపు చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నియోజకవర్గ స్పోర్ట్స్ ఇంచార్జ్ వెన్నరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD