Chegunta: చేగుంటలో మంత్రి వివేక్ వెంకటస్వామికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం!
Chegunta: నూతన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీకి దుబ్బాక నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి చేగుంటలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
Chegunta: చేగుంటలో మంత్రి వివేక్ వెంకటస్వామికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం!
Chegunta: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబ్బాక నియోజకవర్గానికి విచ్చేస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి చేగుంట పట్టణంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండల ప్రెసిడెంట్ కాశ బోయిన భాస్కర్, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ సోలిపేట ప్రసాద్ రెడ్డి, జూకంటి రాజా గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్, వడియారం గ్రామ సర్పంచ్ అంకన్న గారి సాయికుమార్ గౌడ్,చేగుంట యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, నలిన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.




