Gajwel: అవినీతిపై కేసీఆర్ అసెంబ్లీలో జవాబు చెప్పాలి: వివేక్!

Gajwel: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 5 Sept 2026 8:06 PM IST
Gajwel
X

Gajwel: అవినీతిపై కేసీఆర్ అసెంబ్లీలో జవాబు చెప్పాలి: వివేక్!

గజ్వేల్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రాలేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు.

శనివారం గజ్వేల్‌లో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు త్యాగాలు చేస్తే.. బీఆర్‌ఎస్‌కు రూ.1,000 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనాలని, రాష్ట్రంపై ఉన్న రూ.8 లక్షల కోట్ల అప్పులపై కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంతో గజ్వేల్ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని, ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు నియోజకవర్గ అభివృద్ధి కోసం అసెంబ్లీలో నిధులు కోరాలని సూచించారు.

రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL

Next Story