Dubbaka: మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ!

Dubbaka: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలో దుబ్బాక లబ్ధిదారులకు నూతన పెన్షన్ పత్రాలను మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం పంపిణీ చేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 16 Nov 2026 5:23 PM IST
Dubbaka
X

Dubbaka: మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ!

Dubbaka: సంవత్సరాల తరబడి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రజా ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం రామలింగేశ్వర గార్డెన్ లో దుబ్బాక నియోజకవర్గ లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

అంతకు ముందు దుబ్బాక చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో పెన్షన్ రాలేదంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి చేనేత కార్మికులు మంత్రి వివేక్ వెంకట్ స్వామికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రజా ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఇచ్చిన మాట ప్రకారం దుబ్బాక నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK