Siddipet: సిద్దిపేట ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రుల అవగాహన
Siddipet: జనగామలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన మంత్రులు. 50 వేల ఎకరాల సాగు లక్ష్యమని, ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటన. రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలి.
Siddipet: సిద్దిపేట ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రుల అవగాహన
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి పర్యటించారు. అనంతరం మంత్రులు జనగామ గ్రామంలోని మెగా ఆయిల్ ఫామ్ లో మొక్కలు నాటారు. మంత్రి పొన్నం పొన్నం మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు పెంచడానికి ఐదు ఎకరాల పైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు.ఆయిల్ ఫామ్ డిమాండ్ కి తగ్గ ఉత్పత్తి లేదు, రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు.మనకు కూతవేటు దూరంలో నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి విజ్ఞప్తి, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మొగ్గు చూపాలి.ఎల్ నినో రాబోతోంది, తీవ్ర కరువు కాటకాలు, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, రైతులు ఆరుతడి పంటలు వేసుకోవచ్చని అన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 50,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, ఇప్పటికే 14 వేల ఎకరాల్లో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందని,ఆయిల్ ఫామ్ సాగు చేసే వారికి నాలుగు సంవత్సరాల వరకు సబ్సిడీ వస్తుందని తెలిపారు.
దేశానికి ఆయిల్ ఫామ్ అత్యవసరం, ఇరాన్ యుద్ధం వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకుంటే ఇబ్బందులు ఉన్నాయని,మనమే ఉత్పత్తి పెంచాలన్నారు. నాలుగు సంవత్సరాలు ఓపిక పడితే తర్వాత మంచి లాభాలు ఉంటాయి.గత సంవత్సరం కాలేశ్వరం ప్రాజెక్టు లేనప్పటికీ 25 శాతం అదనంగా వడ్లు కొనుగోలు చేయడం జరిగింది, గోదాములు నిండి ఉన్నాయని, 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసిన గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ 5 లక్షలు ప్రోత్సాహకం ఇస్తే జిల్లా ఇన్చార్జి మంత్రిగా నేను కూడా 5 లక్షలు ఇస్తానని తెలిపారు.




