Siddipet: మిరుదొడ్డి మండలంలో పదో తరగతి ఫలితాల ప్రభంజనం.. 98.4 శాతం ఉత్తీర్ణతతో రికార్డు!
Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో పదో తరగతి ఫలితాల్లో 98.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కొండాపూర్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ఎం. వర్ష 579 మార్కులతో మండల టాపర్‌గా నిలిచింది.
Siddipet: మిరుదొడ్డి మండలంలో పదో తరగతి ఫలితాల ప్రభంజనం.. 98.4 శాతం ఉత్తీర్ణతతో రికార్డు!
మిరుదొడ్డి (సిద్దిపేట): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పాఠశాలలు విశేష ప్రతిభ కనబరిచాయి. మండల స్థాయిలో విద్యా ర్థులు అత్యుత్తమ మార్కు లు సాధించి మంచి ఫలితాలను నమోదు చేశారు. మండలంలో మొత్తం 392 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరుకాగా, అందులో 386 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 98.4 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం.మొదటి స్థానం జెడ్పీహెచ్ఎస్ కొం డాపూర్ పాఠశాలకు చెందిన ఎం. వర్ష 579 మార్కులతో సాధించింది. రెండో స్థానం కేజీబీవీ మిరుదొడ్డి విద్యార్థిని ఎం. భావాని 573 మార్కులతో దక్కించు కోగా, మూడో స్థానం టీజీఎంఎస్ మిరుదొడ్డి విద్యార్థిని ఎస్. భువనకృతి 572 మార్కులతో నిలిచింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు విద్యార్థులను అభినందించారు. ఈ ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.




