Mirudoddi: మిరుదొడ్డిలో రామకృష్ణారెడ్డి కుటుంబానికి పరామర్శ
Mirudoddi: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి నీటి సంఘం మాజీ చైర్మన్ లింగాల రామకృష్ణారెడ్డి మరణం పట్ల పీఏసీఎస్ డైరెక్టర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Mirudoddi: మిరుదొడ్డిలో రామకృష్ణారెడ్డి కుటుంబానికి పరామర్శ
మిరుదొడ్డి: మృదుస్వభావి, సేవాభా వం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన లింగాల రామకృష్ణారెడ్డి మరణం బాధాకర మని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పిఎసిఎస్ డైరెక్టర్లు చెప్పాల నర్సింలు, కొండల్ రెడ్డి, రవి, నాగులు, కుమార్ అన్నారు. మిరుదొడ్డిలో రామకృష్ణారెడ్డి కుమారులు పిఎసిఎస్ చైర్మన్ రాజ లింగారెడ్డి, సుజిత్ రెడ్డి లను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మిరుదొడ్డి నీటి సంఘం చైర్మన్ గా పని చేసిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
అలాగే వెనుకబడిన మిరుదొడ్డి లాంటి ప్రాంతంలో 40 ఏళ్ల క్రితం రైస్ మిల్లును స్థాపించి ఈ ప్రాంత రైతాంగానికి వెన్ను దన్నుగా నిలిచారన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగాను ప్రజలకు మెరుగైన సేవలను అందించి వారి మన్ననలను పొందారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారితో పాటు నాయకులు నరేందర్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.




