Siddipet: అరుదైన వ్యాధితో చిన్నారి పోరాటం.. ఆర్థిక భారాన్ని మోయనున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి!
Siddipet: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రియన్షికకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అండ.
Siddipet: అరుదైన వ్యాధితో చిన్నారి పోరాటం.. ఆర్థిక భారాన్ని మోయనున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి!
సిద్దిపేట జిల్లా: తొగుట మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన శివంది లింగం కూతురు రియన్షిక పుట్టినప్పటి నుండి తలసేమియా అనే అరుదైన వ్యాధితో బాధపడగా దానికి సంబంధించి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ ట్రీమెంట్ కోసం హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది అని తెలుసుకొని గౌరవ MLA కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారిని పరామర్శించి.
హాస్పిటల్ ఛైర్మెన్ డా. గురు ఎన్ రెడ్డి గారితో మరియు డాక్టర్ల బృందం తో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం చెయ్యాలని కోరాడు..మరియు ట్రీట్మెంట్ కు ఇప్పటి వరకు 34 లక్షలు కాగా ఇంకా 25 లక్షలు అవుతాయి అని తెలుసుకొని రెక్కాడితే గాని డొక్కా అడని కుటుంబానికి ఇంత పెద్ద ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని తమ వంతు ఆర్థిక సహాయం చేస్తానని పూర్తి భరోసా కల్పించారు.




