Siddipet: నూతన వధూవరులను ఆశీర్వదించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

Siddipet: సిద్దిపేట జిల్లా పలు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 8 May 2026 5:51 PM IST
Siddipet
X

Siddipet

Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకలకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గజ్వేల్ మండలం ముత్రాజ్‌పల్లిలోని ఎస్‌ఎం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

అనంతరం గజ్వేల్‌లోని కేఎంఆర్ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.

మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాయిబాలాజీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అలాగే సిద్దిపేటలోని ఉజ్వల కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story