Siddipet: చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.. ఎమ్మెల్యే!

Siddipet: దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగి మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 31 Oct 2026 12:12 PM IST
Siddipet
X

Siddipet: చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.. ఎమ్మెల్యే!

Siddipet: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని రాంపూర్, ఇబ్రహీంపూర్, పులిమామిడి, కిస్టాపూర్ గ్రామాల్లో ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి లభ్యత, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందన్నారు.

ఇప్పటికే బోర్లలో నీళ్లు రాక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK