Dubbaka: దుబ్బాకలో ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి: ఎమ్మెల్యే
Dubbaka: దుబ్బాకలో ధాన్యం కొనుగోలు ఆలస్యం పై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించి వెంటనే కాంటా పెట్టాలని అధికారులను కోరారు.
Dubbaka: దుబ్బాక మండలంలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతుల సమస్యలపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కాంటా పెట్టి ధాన్యం సేకరణ ప్రారంభించాలని అధికారులను కోరారు.
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డులో 10 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. తీవ్ర ఎండల మధ్య విద్యుత్ దీపాలు, జల్లియంత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
ఈ సమస్యపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించి, జిల్లా కలెక్టర్ హైమావతితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
దుబ్బాక మండలంలోని గోసాన్పల్లి, రఘోత్తంపల్లి, ఆకారం గ్రామాల్లో కూడా ఇదే సమస్య నెలకొన్నట్లు రైతులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. వెంటనే సమస్యను పరిష్కరించి రైతులకు ఉపశమనం కల్పించాలని వారు కోరారు.




