Chegunta: ప్రభుత్వ బడిలో ప్రీ-ప్రైమరీ.. ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి!
Chegunta: చేగుంట మండలంలోని చందాయిపేట, కాసాన్‌పల్లి పాఠశాలల్లో నూతన ప్రీ-ప్రైమరీ విభాగాలను ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
Chegunta: ప్రభుత్వ బడిలో ప్రీ-ప్రైమరీ.. ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి!
Dubbak: దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండల పరిధిలోని చందాయిపేట, కాసాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ విభాగాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్య అందించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా చిన్నారుల్లో అభ్యాస నైపుణ్యాలు, సృజనాత్మకత, సామాజిక అవగాహన పెంపొందుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.




