Thoguta: రెండు నెలలైనా కొనరా? తొగుటలో తడిసిన పొద్దుతిరుగుడు ధాన్యం.. కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్!
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగడంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
Thoguta: రెండు నెలలైనా కొనరా? తొగుటలో తడిసిన పొద్దుతిరుగుడు ధాన్యం.. కాంగ్రెస్ సర్కార్‌పై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్!
తొగుట (సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా తొగుట ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల గోడును పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సాయంత్రం తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన అక్కడ తడిచిన పొద్దు తిరుగుడు ధాన్యంను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితమే పొద్దుతిరుగుడు ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చి పోశామని, కొనుగోళ్లు జరగక వానలకు తడుస్తూ ఎండలకు ఎండిపోతూ పంట నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో చివరికి మార్కెట్ నుంచి బయటకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.




