Dubbaka: శ్రమజీవులకు సలాం.. మే డే శుభాకాంక్షలు తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే
Dubbaka: మే డే సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
Dubbaka: శ్రమజీవులకు సలాం.. మే డే శుభాకాంక్షలు తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే
Dubbaka: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక సోదర సోదరీమణులందరికీ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి చెమట చుక్కలతోనే సమాజం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రతి రంగంలోనూ నిరంతరం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తున్న కార్మికుల సేవలు అమూల్యమని కొనియాడారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. “కార్మికుడు సంతోషంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది” అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర మరియు నియోజకవర్గం కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేసిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి.




