Dubbak: క్యాన్సర్ నిర్ములనే లక్ష్యం : ఎంపీ రఘునందన్ రావు

Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.

Chindam Karunakar, Dubbak
Published on: 7 Jun 2026 8:56 PM IST
Dubbak
X

Dubbak: క్యాన్సర్ నిర్ములనే లక్ష్యం : ఎంపీ రఘునందన్ రావు

Dubbak: మానవసేవే మాధవసేవ" అన్న మాటకు నిదర్శనంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక అడుగు వేశారు. మహిళల ఆరోగ్య రక్షణకు కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధిని తరిమికొట్టడమే లక్ష్యమన్నారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఎంపీ రఘునందన్ రావు శిశిర హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

మహిళల్లో వస్తున్న క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తించి అరికట్టేందుకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక ఖర్చు భరించలేని పేద ప్రజలు ఇబ్బందులు పడవద్దని, ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని తయారు చేసే లక్ష్యంతో తన కూతురు డాక్టర్ సింధు, అల్లుడు శ్రవణ్ తేజ సహకారంతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story